ఎంటర్టైన్మెంట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ రోహిత్ శర్మ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: India

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వినోద రంగంలోకి అడుగుపెడుతున్నారు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా నిర్మిస్తున్న 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' షో సెప్టెంబర్ 19, 2026 నుంచి ప్రసారం కానుంది. క్రికెట్ మైదానంలో తనదైన శైలిలో అలరించిన హిట్మ్యాన్, ఇప్పుడు బుల్లితెరపై తన హాస్య చతురతతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ కొత్త అవతారంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.