రవాణాపల్లి పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన ఎస్ఎంసీ ఎన్నికల ప్రక్రియ
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలంలోని రవాణాపల్లి గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు మృదుభాషిణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో కొమ్మిక పంచాయతీ కిత్తలోవ గ్రామానికి చెందిన కూడా రమణమ్మ చైర్మన్గా, కూడా కనకమహాలక్ష్మి వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులు పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.