మడ్డువలస ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత: నాగావళిలోకి భారీగా వరద నీరు విడుదల
రిపోర్టర్: సురేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా వంగర మండలంలోని మడ్డువలస జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం ఆరు ప్రధాన గేట్లను పైకెత్తి పంతొమ్మిది వేల ఏడువందల యాభై క్యూసెక్కుల నీటిని దిగువనున్న నాగావళి నదిలోకి విడిచిపెట్టామని డీఈఈ అర్జున్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం అరవై ఐదు మీటర్లు కాగా, ప్రస్తుతం అరవై రెండు పాయింట్ డెబ్బై మీటర్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.