పంజాబ్ లో ఏఎస్ఐ హత్య కేసు నిందితుడు ఎన్ కౌంటర్ లో మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: అమృత్ సర్
పంజాబ్ లోని అమృత్ సర్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హర్జిత్ సింగ్ ను హత్య చేసిన నిందితుడు దీపక్ సింగ్ పోలీసుల ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. గేట్ హకీమా పరిధిలోని దానా మండి ప్రాంతంలో పోలీసుల తనిఖీలు చేస్తుండగా కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దీపక్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హత్య వెనుక పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.