స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని వైసీపీ తరఫున పిటిషన్ దాఖలు కాగా, ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం త్వరలోనే తుది తీర్పు వెలువరించనున్నట్లు స్పష్టం చేసింది.