టీచర్లను కించపరిచేలా వైసీపీ వ్యవహరిస్తోందంటూ తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: అమరావతి

సమాజంలో మార్పు తెస్తామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉపాధ్యాయులను కించపరిచేలా వ్యవహరిస్తూ, బూతులు తిట్టడమే మీరు తెచ్చే మార్పు అంటూ టీడీపీ ప్రశ్నించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా నిలదీస్తూ పలు విమర్శలు గుప్పించింది.