సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు నాని ది ప్యారడైజ్
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రకటనతో నాని అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.