రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధింపు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రహదారుల పక్కన చెత్త వేసే వారిపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఎన్హెచ్-65 వలిగొండ జంక్షన్ నుంచి లింగోజిగూడెం రహదారిపై మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్గౌడ్ పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేస్తున్న నలుగురిని గుర్తించి, వారికి గాంధీగిరి పద్ధతిలో అవగాహన కల్పించడంతో పాటు ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధించారు. ప్రజలు పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ వాహనాలకే చెత్తను అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.