ఆసియా క్రీడల్లో డబుల్ ధమాకా సృష్టించిన షూటర్ ఇలవేనిల్

రిపోర్టర్: సతీష్ స్థలం: India

ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ ఇలవేనిల్ వలరివన్ అద్భుత ప్రదర్శన కనబరిచి డబుల్ ధమాకా సాధించారు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించడంతో పాటు, సోనమ్ మస్కార్, విదర్స్ వినోద్‌లతో కూడిన జట్టు విభాగంలోనూ రజత పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి తొలి పతకాలను అందించారు.