అనుమతి లేకుండా తమ సినిమా పాట వాడటంపై నిర్మాత మంచి వెంకట్ ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

పర్ణశాల చిత్రంలోని జిమ్ జిమ్ తార పాటను అనుమతి లేకుండా ఆదర్శ కుటుంబం సినిమాలో ఉపయోగించడంపై నిర్మాత మంచి వెంకట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదల కాకముందే తమ పాటను మరో చిత్రంలో వాడటం చిన్న సినిమాకు అన్యాయం చేయడమే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమ చిత్రానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాపోయారు.