'కార్మికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నాం': ఏపీలో అగ్నిమాపక నిబంధనలు సవరణ

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న అగ్నిమాపక భద్రత నిబంధనలను ఏపీ ప్రభుత్వం సవరించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, ఇతర రాష్ట్రాల అత్యుత్తమ విధానాలను పరిశీలించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు, ప్రమాదాల నుంచి ఆస్తులను కాపాడటం, వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడటమే లక్ష్యంగా ఇండస్ట్రియల్‌ పార్క్‌లు, సెజ్‌లు, ఎంఎస్‌ఎంఈలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.