పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం

రిపోర్టర్: నరేష్ స్థలం: ఎన్టీఆర్

ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వీరులపాడు మండలం అల్లూరు గ్రామ పంచాయతీలో “కళాజాత” చైతన్య కార్యక్రమం నిర్వహించినట్లు కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల పాటలు, నాటకాల ద్వారా ప్రజల్లో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై విస్తృతమైన అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్లాస్టిక్ రహిత సమాజం ఏర్పాటు కోసం అధికారులు చేపట్టిన ఈ వినూత్న ప్రచార కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.