తిరుమలలో మొక్కు తీర్చుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తిరుపతి
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి తన 74వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుపతిలో తమ విశ్వవిద్యాలయానికి అనుమతులు వస్తే మోకాళ్లపై వచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపారు. పర్మిషన్ రావడంతోనే నేడు వచ్చి ఆ మొక్కును చెల్లించుకున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఏపీలో విద్యాసంస్థలను విస్తరిస్తామని స్పష్టం చేశారు.