నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్ గేటు ఎత్తివేతతో భయంతో కొండపైకి పరుగులు పెట్టిన ప్రజలు

రిపోర్టర్: హరి స్థలం: Nandyal

నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు రిజర్వాయర్ ఔట్‌ఫాల్ రెగ్యులేటర్ గేటును ఆకతాయి ఎత్తడంతో గ్రామంలోకి భారీగా నీరు పోటెత్తింది. కట్ట తెగిపోయిందన్న భయంతో గ్రామస్తులు ఆందోళన చెంది కొండపైకి పరుగులు తీశారు. ఎలక్ట్రీషియన్ కోటయ్య సకాలంలో స్పందించి గేటు దించడంతో పెనుముప్పు తప్పింది. ఈ ఘటనపై కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్యే గౌరు చరిత పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.