సింగంపల్లి గ్రామానికి తక్షణమే ఆర్టీసి బస్సు సౌకర్యం కల్పించాలని వినతి
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు మండలంలోని సింగంపల్లి గ్రామానికి సరైన సమయానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో వచ్చే బస్సు సమయం ప్రజలకు అనుకూలంగా లేదని, ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు నడపాలని కోరుతూ గ్రామస్థులు మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు.