భోగాపురం విమానాశ్రయం పేరు మార్పు: ఇకపై విశాఖపట్నం పేరుతోనే బుకింగ్స్

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం ప్రాంతానికి సేవలందిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పేరులో కీలక మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల గందరగోళాన్ని తొలగించేందుకు అంతర్జాతీయ వాయు రవాణా సంఘం నిర్ణయం తీసుకుంది. నవంబర్ ఇరవై ఒకటి నుంచి టికెట్ బుకింగ్ వెబ్సైట్లలో భోగాపురం స్థానంలో విశాఖపట్నం పేరు కనిపించనుంది. అయితే వీటీజెడ్ కోడ్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.