భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష రిజర్వాయర్లు నింపాలని ఆదేశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అమరావతిలోని ఆర్టీజీ సెంటర్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నదులు, రిజర్వాయర్లకు వస్తున్న వరద ప్రవాహాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని అన్ని నీటి వనరులను నింపాలని ఆయన స్పష్టం చేశారు. వర్షాల వల్ల జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.