విశాఖలో తీవ్రరూపం దాల్చిన తాగునీటి కొరత కష్టాలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విశాఖపట్నం
ఎల్నినో ప్రభావం వల్ల విశాఖపట్నంలో భూగర్భజలమట్టాలు భారీగా పడిపోయాయి. నగరంలో నీటి కొరత తీవ్రతరమవడంతో ప్రజలు ట్యాంకర్లు, వాటర్ క్యాన్లపై ఆధారపడాల్సి వస్తోంది. జీవీఎంసీ సరఫరా చేస్తున్న నీరు సరిపోక, కనీస అవసరాలకూ మహిళలు నానా పాట్లు పడుతున్నారు. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా నీటి ఇబ్బందులు తప్పడం లేదు.