పంతంగిలో ఘనంగా గణపతి మండపం వద్ద అన్నప్రసాద వితరణ

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామంలో స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. అన్నప్రసాద పోషకులు బాతరాజు శంకరయ్య–లక్ష్మమ్మ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా వితరణ ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గరిసే ఐలయ్య సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాకి శ్రీలత సుందర్, ఉపసర్పంచ్ బోయ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి ప్రభాకర్‌రెడ్డి, మాధగోని పరమేశ్వరి శంకర్‌గౌడ్, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్‌గౌడ్, మాజీ సర్పంచ్ అంతటి రమేష్‌గౌడ్, చినుకని మల్లేష్‌యాదవ్, కడగంచి చలమంద రాజు, మిర్యాల రవి, గౌరవ సభ్యులు గుండేపురం వెంకటేష్,గుండె పురం శేఖర్ కడగంచి నాగరాజు, బండ మల్లేష్ , , గుండె పురం మహేష్, గరిసే మహేష్ పంతంగి మాధవాచారి , మాదగోని కుమారస్వామి, వేలిజాల శ్రీకాంత్ బొడిగె రవీందర్, జాజుల వినోద్ కుమార్ , ఆనగంటి లింగస్వామి, కూనూరు శివకుమార్, గుండె పురం ప్రణీత్, ఆనగంటి ప్రతీక్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.