హీరోయిన్ ఇమాన్వీకి ప్రభాస్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కోస్టార్ ఇమాన్వీకి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రకరకాల వెరైటీ వంటకాలతో కూడిన భారీ భోజనాన్ని పంపించినట్లు నటి ఇమాన్వీ వెల్లడించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోన్న ఫౌజీ చిత్రంలో ఇమాన్వీ నటిస్తున్నారు. ప్రభాస్ పంపిన హైదరాబాదీ ఫీస్ట్, బిర్యాని, చికెన్ వెరైటీల ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.