హాలీవుడ్ స్థాయికి రామాయణం: దర్శకుడు నితేశ్ తివారీ, నిర్మాత నమిత్ మల్హోత్రా
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హాలీవుడ్ చిత్రాల కంటే గొప్ప విజువల్స్ తో రామాయణం సినిమాను తెరకెక్కిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. నితేశ్ తివారీ దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అవతార్, అవెంజర్స్ సినిమాల సరసన నిలపాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ప్రేక్షకులకు మన ఇతిహాస గొప్పతనాన్ని చాటిచెప్పేలా భారీ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించామని నమిత్ స్పష్టం చేశారు.