జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ప్రభుత్వానికి ఏపీయూడబ్ల్యూజే నాయకుల డిమాండ్
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం వద్ద మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ టౌన్ సీఐకి వినతిపత్రం అందజేశారు.