వైఎస్సార్సీపి నేత జన్మదిన వేడుకలు: కటోపల్లిలో ఘనంగా పేదలకు వస్త్రాల పంపిణీ

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని కటోపల్లి గ్రామంలో వైయస్సార్సీపి బీసీ సెల్ అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు చీరలు, లుంగీలు, టవల్స్ అందజేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.