వంజరి పంచాయతీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్యటన: కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.మాడుగుల
అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం వంజరి పంచాయతీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం గారు ఈ నెల ఆరవ తేదీన మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పర్యటించనున్నారు. ఈ పర్యటనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.