మెగా డాటర్ నిహారిక పాకెట్ రాకెట్స్ మూవీ స్పెషల్ వీడియో విడుదల
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాణంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ పాకెట్ రాకెట్స్ సినిమా నుంచి ది ఫస్ట్ హ్యాండ్ పేరుతో ప్రత్యేక వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా నటిస్తున్నారు. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ పందొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.