హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ డోర్డాష్ తొలి కేంద్రం ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ ఫుడ్ డెలివరీ దిగ్గజం డోర్డాష్ తన తొలి డెవలప్మెంట్ సపోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అమెరికాకు చెందిన ఈ గ్లోబల్ సర్వీస్ సెంటర్ ద్వారా స్థానిక నిరుద్యోగ యువతకు మరియు ఐటీ నిపుణులకు భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాబోయే రోజుల్లో ఏకంగా మూడు వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని నిర్వాహకులు వెల్లడించారు.