గూడూరు అభివృద్ధిపై చర్చకు రావాలంటూ వైకాపాకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సవాల్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: గూడూరు
గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు బ్రిడ్జి అప్రోచ్ పనులకు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్యే సునీల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో తెదేపా హయాంలో ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.9.26కోట్లతో అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టినట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని వైకాపా నేతలకు ఆయన సవాల్ విసిరారు.