యూపీఐ చార్జీల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వర్తకుల నిరసన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఇండోర్
డిజిటల్ లావాదేవీలపై జీరో పాయింట్ ఫోర్ శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇండోర్‌లోని వర్తక సంఘాలు నో యూపీఐ డే పేరిట నిరసన చేపట్టాయి. అక్టోబర్ పదిహేను నుంచి రూ. రెండు వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై అదనపు చార్జీలు వసూలు చేయాలన్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయాన్ని తప్పుపడుతూ క్యూఆర్ కోడ్లపై నల్ల గుడ్డలు కప్పి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిబంధన వెనక్కి తీసుకోకుంటే యూపీఐ సేవలు నిలిపివేస్తామని వర్తకులు హెచ్చరించారు.