ప్రధాని మోదీ జన్మదినం వేళ హైదరాబాద్‌లో మెగా రక్తదానం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్‌లోని కోఠీ, జాంబాగ్‌లో బిజెపి మెడికల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.