కేసీఆర్ చావు కోరుకునే దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ లో బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కేసీఆర్ చావు కోరడంపై కాంగ్రెస్ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ను దేవుడిగా భావించే ప్రజలున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని స్పష్టం చేశారు.