మనుబోలులో ముప్పై ఐదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ స్మశాన అభివృద్ధి

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో గత 35 సంవత్సరాలుగా ఎస్సీల స్మశానం అభివృద్ధికి నోచుకోకుండా వెలవెలబోయింది. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన వెంటనే స్పందించి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారికంగా స్మశాన అభివృద్ధి పనులను ప్రారంభించారు.