చెన్నైలో యువతిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడానికి యత్నం

రిపోర్టర్: విజయ్ స్థలం: చెన్నై

చెన్నైలోని పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి అనే 24 ఏళ్ల యువతిపై ప్రకాష్ అనే నిందితుడు పెట్రోల్ పోసి నిప్పుంటించాడు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని వెళ్తుండగా ఆసుపత్రి అత్యవసర విభాగం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో 48 శాతం గాయాలైన బాధితురాలను మెరుగైన చికిత్స నిమిత్తం కిల్‌పాక్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని తిరువళ్లూరులో గుర్తించి, పోలీసులపైకి దాడికి యత్నించడంతో కాల్పులు జరిపి అరెస్టు చేశారు.