నెల్లూరులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: కిరణ్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో నవంబర్ ఒకటో తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ హిమాన్షుశుక్లా వెల్లడించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామని, అధికారుల పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని, భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.