పెద్దపల్లిలో ముందస్తు బతుకమ్మ వేడుకలు: ఘనంగా పాల్గొన్న న్యాయమూర్తి

రిపోర్టర్: SK స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ క్యాడర్ స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గౌరవ న్యాయమూర్తి శ్రీమతి శ్రీనిజ కోహిర్కర్, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.