గ్రాడ్యుయేట్ ఓటు నమోదు తప్పనిసరి: ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి
రిపోర్టర్: BHARADWAJ
స్థలం: మునగాల
మునగాల మండల పరిధిలో ఉపాధ్యాయుడు వక్కంతల భరత్ బాబు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు పత్రాలను ఎమ్మార్వో కార్యాలయంలో సమర్పించారు. గతంలో ఓటు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఫారం పద్దతి ప్రకారం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు నవంబర్ ఆరో తేదీలోగా దరఖాస్తులను సమర్పించి ప్రజాస్వామ్య పరిరక్షణలో క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.