పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్న సూరి 'మందాడి' సినిమా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Tamil Nadu
కోలీవుడ్ నటుడు సూరి ప్రధాన పాత్రలో మతిమారన్ పుగజేంది దర్శకత్వంలో తెరకెక్కిన 'మందాడి' చిత్రం థియేటర్లలో పాజిటివ్ టాక్తో ప్రదర్శన కొనసాగిస్తోంది. పడవ రేసుల నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో సుహాస్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక విడుదల తేదీ ఇంకా వెల్లడి కాలేదు.