పుత్తూరులో ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా సీపీఐ జోరుగా ప్రచారం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: నగరి

తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడవ వార్డులో సీపీఐ అభ్యర్థి ఏ రోజా విజయమే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడుతూ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యలు తాగునీటి కొరత పారిశుద్ధ్య లోపాలను కౌన్సిల్ వేదికగా ప్రశ్నిస్తామని స్పష్టం చేస్తూ కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.