ఫహాద్ ఫాజిల్ సినిమా విజయం సాధించాలంటూ నటుడు ఎన్టీఆర్ ఆకాంక్ష
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం గొప్ప విజయం సాధించాలని ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫహాద్ ఫాజిల్ దేశం గర్వించదగ్గ నటుడని, ఆయన తెలుగులో మొదటిసారి లీడ్ యాక్టర్‌గా నటిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు.