పల్లెపహాడ్ వేదికగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పల్లెపహాడ్ గ్రామంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కేంద్రంలో కేక్ కట్ చేసి స్థానికులకు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు కోల అనిల్, ఉపాధ్యక్షులు ఆకుల సత్తయ్య, యువమోర్చా మండల ఉపాధ్యక్షులు ఆకుల రవీందర్, కోశాధికారి బూడిద నరసింహ గౌడ్, ఎస్సీమోర్చా మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి మధు తదితర నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.