హైదరాబాద్‌లో మిఠాయి దుకాణాలపై దాడులు: టన్నుల కొద్దీ అపరిశుభ్ర స్వీట్లు సీజ్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో మిఠాయి దుకాణాలు, తయారీ యూనిట్లలో టీజీ సేఫ్ అధికారులు జరిపిన తనిఖీల్లో తీవ్ర ఉల్లంఘనలు బయటపడ్డాయని కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్ల తయారీ జరుగుతున్న పదహారు కేంద్రాలపై ప్రత్యేక బృందాలు దాడులు చేశాయని ఆయన పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా కల్తీ అనుమానంతో ఇరవై రెండు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు వెల్లడించారు. గడువు తీరిన మూడు వేల ఐదు వందల నలభై ఆరు కేజీల స్వీట్లను సీజ్ చేశామని ఆయన వివరించారు.