వడ్డెరలకు క్వారీ లీజులు, ఫీజుల్లో 50 శాతం రాయితీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వడ్డెర వర్గాల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 100 హెక్టార్ల భూమిని క్వారీ పూల్‌గా గుర్తించింది. ఈ క్వారీ లీజులను కేవలం రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకే కేటాయించనున్నారు. అంతేకాకుండా క్వారీ లీజు రుసుములు మరియు సీనరేజ్ ఫీజులో 50 శాతం భారీ రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.