విశాఖలో తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ జలప్రవేశం: రాజ్‌నాథ్ సింగ్
రిపోర్టర్: సునీల్
స్థలం: విశాఖపట్నం
భారత రక్షణ రంగాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలో భాగంగా విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రాంగణంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ను అధికారికంగా జలప్రవేశం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నౌకాదళ ఆపరేషనల్ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసేందుకు ఈ యుద్ధనౌక ఎంతగానో ఉపయోగపడుతుందని రక్షణ శాఖ వెల్లడించింది.