బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లోకి ముగ్గురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ముందస్తు వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా సరికొత్త ట్విస్ట్ ఇచ్చేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్‌కు ముందు జరిగిన అగ్నిపరీక్ష కార్యక్రమంలో పాల్గొన్న నవరసాలు రామకృష్ణ, మిథిలేష్, అపూర్వ పేర్లు వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ముగ్గురు అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతుండగా, వీరి ఎంట్రీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.