విజయనగరం జేఎన్‌టీయూలో రెండోరోజూ కొనసాగిన మార్కుల మార్పు అక్రమాల విచారణ

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ పరీక్షల విభాగంలో జరిగిన మార్కుల మార్పు అక్రమాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి కమిటీ విచారణ రెండోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. విద్యామండలి కార్యదర్శి తిరుపతిరావు, అకడమిక్‌ అధికారి శ్రీరంగ మాథ్యూ ఈ విచారణ నిర్వహించగా, ఒప్పంద ఉద్యోగుల చేతుల్లో పరీక్షల నిర్వహణ ఉండటంపై అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతిచెందిన ఉద్యోగి సంతోష్‌ లేఖలో పేర్కొన్న నలుగురు ఒప్పంద అధ్యాపకుల్లో ముగ్గురు విచారణకు గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. విచారణ అనంతరం కమిటీ సభ్యులు స్థానిక పోలీసులను సంప్రదించి కీలక సమాచారం సేకరించారు.