అయ్యప్ప సన్నిధాన ఆకృతిలో భక్తిశ్రద్ధలతో వినాయక వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మునగపాక
అనకాపల్లి జిల్లా మునగపాక మండలం అరబుపాలెం పంచాయతీ కేంద్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. వివిధ యూత్ కమిటీల ఆధ్వర్యంలో విభిన్న రీతిలో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా అగ్నిస్టార్స్ యూత్ ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప సన్నిధానం అలాగే పద్దెనిమిది మెట్ల ఆకృతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వినూత్న మండపాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.