శంభు లింగేశ్వర ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నిజామాబాద్ రూరల్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు రాజు కిరణ్ ఆధ్వర్యంలో ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు, హారతులు ఘనంగా సమర్పించి భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. భక్తులు భారీగా తరలివచ్చి కాయలు కొట్టి పూజలు చేశారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో రాములు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.