రైతు బజార్లలో రూ.32లకే కిలో ఉల్లిపాయలు అందించనున్న ఏపీ ప్రభుత్వం
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 115 రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలను కేవలం రూ. 32 కే అందించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. మొబైల్ కౌంటర్ల ద్వారా కూడా వీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు.