మృత్యు ఘంటికలు మోగిస్తూ NH16 జాతీయ రహదారి

రిపోర్టర్: sai స్థలం: వెంకటాచలం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ పరిధిలోని చింతాలమ్మ సిమెంట్ బ్రిక్స్ సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆపై వరుసగా వాహనాలు వెళ్లడంతో మృతదేహం పూర్తిగా నుజ్జునుజ్జయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.