నవాబుపేటలో అంగన్వాడీ కార్యకర్తలను ఘనంగా సత్కరించిన మహిళా మోర్చా

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం పట్టణంలోని ఈస్ట్ మండలం నవాబుపేట అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలను మహిళా మోర్చా ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వై. స్మిత మాట్లాడుతూ చిన్నారుల పోషణ, విద్య, ఆరోగ్యం కోసం నిరంతరం సేవలందిస్తున్న అంగన్వాడీల సేవలను గుర్తించి గౌరవించడం అందరి బాధ్యత అని తెలిపారు.