పాఠశాలలకు భవనాలు కట్టలేక కంటైనర్లను ఉపయోగిస్తున్నారంటూ మంత్రి సీతక్కపై బీఆర్ఎస్ విమర్శ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Mulugu
పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించలేక కంటైనర్లను ఉపయోగిస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించగా, జిల్లాలో ఇప్పటికే ఐదు చోట్ల ఇలాంటి పాఠశాలలు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే విద్యారంగంలో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా, విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.